సిబిఐ కోర్టు ఎదుట హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి 

posted on: Feb 27, 2024 2:14PM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో ఆయన మూడోసారి విచారణ కోసం వెళ్లారు. తొలిసారి జనవరి 28న, రెండోసారి ఫిబ్రవరి 24న సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు.  
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును విచారిస్తున్న హైదరాబాద్‌లోని సీబీఐ న్యాయస్థానం నేడు మరోమారు విచారణ జరిపింది. కేసు విచారణకు వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి కోర్టు ఎదుట హాజరయ్యారు. ఆయనతోపాటు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర నిందితులు గంగిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, ఉదయ్ కుమార్, సునీల్ యాదవ్ కూడా కోర్టుకు హాజరయ్యారు. వాదనల అనంతరం కోర్టు మార్చి 12కు తదుపరి విచారణను వాయిదా వేసింది. 

కాగా, వివేకా హత్యకేసులో కడప ఎంపీ అయిన అవినాశ్‌రెడ్డి ఎనిమిదో నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే ఆయనను సీబీఐ పలుమార్లు విచారించింది. అనంతరం ఆయనను అరెస్ట్ చేసిన సీబీఐ రూ. 5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు తీసుకొని వెంటనే విడుదల చేసిన విషయం తెలిసిందే. 

 

google-ad-img
    Related Sigment News
    • Loading...