భారత ఆత్మపై ఓవైసీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

బైబిల్, ఖురాన్ లు భారతదేశం ఆత్మ కాదంటూ కేంద్రమంత్రి మహేష్ శర్మ చేసిన వ్యాఖ్యలపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఘాటైన సమాధానం ఇచ్చారు. భారత్...భిన్నమతాల సమాహారమన్న ఓవైసీ, ఇండియా ఆత్మ లౌకికత్వమంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.
ఇండియా ఒక మతానికి మాత్రమే చెందింది కాదన్న అసద్... ఫాసిస్టు పాలకులకు దేశ మౌలిక విధానాలపైనా అవగాహన లేదని వ్యాఖ్యానించారు. పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురాకపోతే, 1984లో సిక్కులపై జరిగిన దాడులు, 2002లో గుజరాత్ ముస్లింలపై జరిగిన దాడులు మళ్లీ రిపీట్ అవుతాయని ఆందోళన వ్యక్తంచేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu