TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోత్కుపల్లి దీక్ష

Published on: Sat Nov 22, 2014 11:46AM

 

తెలుగుదేశం పార్టీ సినియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర దీక్ష చేపట్టారు. ఎన్టీఆర్‌ పేరును శంషాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కి పెట్టడానికి వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ ఆయన దీక్షకు దిగారు. తెలుగుదేశం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఘాట్‌కి చేరుకుని మోత్కుపల్లి దీక్షకు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు వెంట ఏపీ మంత్రి రావెల కిషోర్‌బాబు, తెలుగుదేశం నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్.రమణ, పెద్దిరెడ్డి, మాగంటి గోపీనాథ్ తదితరులు చంద్రబాబు నాయుడి వెంట వచ్చి మోత్కుపల్లికి సంఘీభావం తెలిపారు.