Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మాజీ మంత్రికి అస్వస్థత
posted on: Dec 7, 2018 9:28AM

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అర్ధరాత్రి నుంచి వాంతులు, గుండె నొప్పితో ఆయన బాధపడుతున్నారు. సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో ఆయనను సొంత వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గం నుంచి బీఎల్‌ఎఫ్ అభ్యర్థిగా మోత్కుపల్లి బరిలో ఉన్నారు. ఆయన అస్వస్థతకి గురవ్వటంతో బీఎల్‌ఎఫ్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.






