TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముగ్గురు కూతుళ్ళను చంపి...

Published on: Sat Mar 28, 2015 12:24PM

 

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామానికి చెందిన ఒక మహిళ తన ముగ్గురు కుమార్తెలను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. తన ఇంట్లోనే తన కుమార్తెలతోపాటు తన మీద కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడంతో అందరూ సజీవ దహనమయ్యారు. చిలుకూరు గ్రామానికి చెందిన అనిత (25) శుక్రవారం రాత్రి సమయంలో తన ముగ్గురు కుమార్తెలు అనిత మౌనిక (4), అక్షిత (3), జయలక్ష్మి (1) మీద కిరోసిన్ పోసి నిప్పంటించిన అనంతరం తాను కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె భర్త గిరీష్ రాత్రి ఎనిమిదన్నర ప్రాంతంలో ఇంటికి వచ్చే సమయానికి తలుపు గడి వేసి వుంది. ఎంతకూ తలుపు తీయకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూస్తూ లోపల నలుగురి మృతదేహాలు కాలిపోయి కనిపించాయి. ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదు.