ఉద్యోగం కోసం తల్లీ కూతుళ్ల పోటీ.. ఇద్దరూ విజేతలే

posted on: Dec 14, 2022 2:25PM

రాజకీయాలలో తల్లీ కూతుళ్లు, తండ్రీ కొడుకులూ.. అన్నాదమ్ములు ఇలా రక్త సంబంధీకులు సైతం ప్రత్యర్థులుగా మారి పోటీలు పడటం చూశాం. కానీ ఉద్యోగం విషయంలో తల్లీ కూతుళ్లు పోటీ పడిన సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఖమ్మం జిల్లా చెన్నారం గ్రామానికి చెందిన తళ్లీ కూతుళ్లు ఎస్సై పరీక్ష రాసి ప్రిలిమనరీలో పాసయ్యారు. ఈవెంట్స్ కువచ్చారు. వాటిలోనూ ఒకరికొకరు పోటీ పడ్డారు. చివరకు ఇద్దరూ పాసయ్యారు.  ఇక మెయిన్ పరీక్ష ఒక్కటే మిగిలింది. అందులోనూ పాసైతే ఇద్దరూ ఎస్సై కొలువుల్లో స్థిరపడతారు.

మెయిన్ లో కూడా విజయం సాధించి జాబ్ కొడతామని ఇద్దరూ విశ్వాసం వ్యక్తం చేశారు. తల్లీ కూతుళ్లు నాగమణి, త్రిలోకిని కి పోలీసు కొలువు చేయాలని ఆకాంక్ష. తల్లి నాగమణి ఇప్పటికే హోం గార్డుగా పని చేశారు. ఆ తరువాత కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ములుగు జిల్లాలో కానిస్టేబుల్ గా కొలువులో ఉన్నారు. ఆమె కుమార్తె త్రిలోకిని తల్లి బాటలో నడిచి కానిస్టేబుల్ కాకుండా ఎస్ ఐ కావాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. కుమార్తె పట్టుదల చూసి తాను సైతం అంటూ నాగమణి కూడా ఎస్సై పోస్టు కోసం తన వంతుగా ప్రిపరేషన్స్ ప్రారంభించింది.

ఆ కక్రమంలోనే కుమార్తెతో ప్రిలిమినరీ పరీక్ష రాసి పాసయ్యింది. ఆ తరువాత ఎస్ఐ సెలక్షన్స్ లో అత్యంత ముఖ్యమైన ఈవెంట్స్ కు హాజరైంది. అక్కడా కూతురితో పోటీపడి ఆమెతో సమానంగా విజేతగా నిలిచింది. ఇక మిగిలింది మెయిన్ పరీక్ష. అందులోనూ గెలుస్తామన్న ధీమాను తల్లీ కూతుళ్లు వ్యక్తం చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...