నిత్య పెళ్లికొడుక్కి బుద్ధిచెప్పిన  త‌ల్లీ పిల్ల‌లు! 

విదేశాల్లో చ‌దువుకున్న వ్య‌క్తి  వ‌చ్చి ఒక్క‌డో అమ్మాయిని ప్రేమించి పెళ్లాడ‌తాడు. ఆన‌క ఓ కోటీశ్వ‌రుడి కూతురు ప్రేమ‌లో ప‌డి ఆమెను పెళ్లాడ‌బోతాడు.. మొద‌టి భార్య ఏడాది బిడ్డ‌తో వ‌చ్చి రామూ.. ఎందుకు ఇంత ద్రోహం చేశావ్‌.. అంటూ కొంగు, పిల్లాడి త‌ల‌ని త‌డిపేస్తూ ఏడిచి భారీ డైలాగు చెబుతుంది.. త‌ర్వాత సంగ‌తి వేరే.. ఇది దాదాపు పాత సినిమాల్లో చాలావాటిల్లో సీన్‌. ఇదే సీన్ నిజ జీవితంలోనూ జ‌రిగితే.. అమ్మో! 

అవ‌కాశం లేక‌పోలేదు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఒక ప‌ట్ట‌ణంలో ఇదే సీన్ జ‌రిగింది. కాబోతే స‌ద‌రు హీరోగారు అంత‌కు ముందే నాలుగు పెళ్లిళ్లు చేసుకుని, ఏడుగురు పిల్ల‌ల తండ్రి! జ‌రిగేది ఐదో పెళ్లి. అయితే ఈ నిత్య‌పెళ్లి కొడుకు 55 ఏళ్ల‌వాడు. విదేశీయుడూ కాదు, ప‌క్కా లోక‌ల్‌! పెళ్లి పిచ్చి ఉండాలేగాని ఇలాంటి దొంగ‌పెళ్లిళ్లు చేసుకోవ‌డానికి ఏదో ఒక దొంగ మార్గాన్ని ఇలాంటివారు వెతుకుతూనే ఉంటారు. కాబోతే, ఇలాంటివారికి దొరికే అమ్మాయిలే అమాయ‌కులు. అమ్మాయి త‌ల్లిదండ్రుల‌కు ఏమాత్రం అనుమానం రాకుండా అత‌గాడు వ్య‌వ‌హ‌రించే ఉంటాడు. అయినా క‌నీస వివ‌రాలు సేక‌రించ‌కుండా పెళ్లికి సిద్ధ‌ప డ‌టం పెద్ద ముప్పు త‌ప్పిం చిందని ఆన‌క అనుకున్నారు. 

నిత్య‌పెళ్లి కొడుకుకి నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి, ఇద్ద‌రు విడాకులిచ్చి వెళిపోయారు. మ‌రో ఇద్ద‌రు ర‌హ స్యం గానే పెళ్లి చేసుకున్నారు. రెండో భార్య‌కి ఏడుగురు పిల్ల‌లు. హీరోగారు ఏం చేస్తుంటాడో ఆమెకు అంత‌గా తెలియ‌ద‌నే అనుకోవాలి. ఇత‌గాడు బ‌హుశా అమ్మాయిల వేట‌నే  వృత్తిగా చేసుకున్నాడేమో. మొత్తానికి అత‌నికి మ‌రో అమ్మాయి వ‌ల‌లో ప‌డింది. పెళ్లికి సిద్ధ‌ప‌డింది.  పెళ్లిపీట‌లు ఎక్కారు. మ‌రో కొద్ధిసేప‌ట్లో  తాళి క‌ట్టాలి.

అంత‌లో సినిమాటిక్‌గా మిస్ట‌ర్ నిత్య పెళ్లికొడుకు రెండో భార్య ఏడుగురు పిల్ల‌ల‌తో స‌హా వ‌చ్చింది.  వేదిక మీద తండ్రిని చూసి పిల్ల‌ల్లో ఒక‌రిద్ద‌రు నాన్నా.. అంటూ అరుస్తూ వేదిక మీద‌కి పరిగెట్టారు. ఈమె అయ్యో నా గ‌తేంగాను  అంటూ రుష్యేంద్ర‌మ‌ణి స్థాయిలో కూల‌బ‌డ ఏడ‌వ‌లేదు. అమాంతం అక్క‌డున్న‌వారికి కొత్త పెళ్లికొడుకు నా భ‌ర్తే  అంటూ వాడి అస‌లు సంగ‌తి చెప్పింది. త‌ర్వాత ఏమి జ‌రిగి ఉంటుంద‌న్న‌ది మీకూ అర్ధ‌మ‌యి ఉంటుంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu