తెరమీదకు మరిన్ని విభజనలు

 

 

 

కేంద్రం తెలంగాణ ప్రకటించిన నేపధ్యంలో ఇప్పుడు మరిన్ని ప్రత్యేక వాదాలు తెరమీదకు వస్తున్నాయి. 50 ఏళ్లుగా నలుగుతున్న తెలంగాణ సమస్యను మూడు రోజుల్లో తేల్చేసిన కాంగ్రెస్‌ తమ డిమాండ్లను కూడా అదే స్థాయిలో పరీష్కరించాలని కోరుతున్నారు.

 

 

 

తెలంగాణ సమస్యకు పరిష్కారం దిశగా కాంగ్రెస్‌ అడుగులు వేయడం మొదలవగానే గూర్ఖాలండ్‌ ప్రతిపాదన కూడా ఊపందుకుంది. ప్రస్థుతం ఆ ప్రాంతంలో 72 గంటల బంద్‌ కొనసాగుతుండగా, రాష్ట్రం ఏర్పడే వరకు వెనకడుగు వేసేది లేదంటున్నారు ఉద్యమకారులు.

 

 

దీంతో పాటు మహారాష్ట్రలో కాంగ్రెస్‌ నాయకులు కూడా విదర్భ రాష్ట్రం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో పాటు అస్సాంలో బోడాలాండ్‌, పశ్చిమ యుపిలో హరిత్‌ ప్రదేశ్‌, బీహార్‌లో మిథిల, యుపిలో పూర్వాంచల్‌, లాంటి మరిన్ని డిమాండ్‌లు తెరమీదకు వస్తున్నాయి.