Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మోపిదేవి కి మధ్యంతర బెయిల్
posted on: Dec 18, 2012 5:54PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తులకు సంబంధించి వాన్‌పిక్ కేసులో అరెస్టై చంచల్‌గూడ జైల్లో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు నాంపల్లి ప్రత్యేక సీబీఐ కోర్టు మంగళవారం కొన్ని షరతులతో కూడి మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. శబరిమల యాత్రకు వెళ్లేందుకు ఈనెల 24 నుంచి జనవరి 2వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేసింది.
అయితే మోపిదేవి వెంట కొంత మంది గార్డులు కూడా ఉంటారని, కేసుకు సంబంధించి ఎవరినీ కలవకూడదని, మాట్లాడకూడదని కోర్టు షరతులు విధించింది. కాగా అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు బెయిల్ ఇవ్వాల్సిందిగా మోపిదేవి బెయిల్ పిటిషన్ పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఈరోజు విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు బెయిల్ మంజూరు చేసింది.


.jpg)
.png)


