TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోపిదేవి, బీద.. రేపు టీడీపీ తీర్థం!

Published on: Tue Oct 8, 2024 2:43PM

వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు రేపు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఆయన సమక్షంలో వీరు తెలుగుదేశం కండువాలు కప్పుకోనున్నారు. వీరి వెంట పెద్ద సంఖ్యలో వీరి అనుచరులు కూడా తెలుగుదేశం తీర్ధం పుచ్చుకోనున్నారు.  2019 డిసెంబర్లో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన మస్తాన్ రావు ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరుతున్నారు.