మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య
posted on: Feb 24, 2026 11:31AM
.webp)
తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ డేటా సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న భువన అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. తిరుమలలోని ఓ ప్రైవేట్ హాస్టల్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మరణించింది. ఈ ఘటన సోమవారం (ఫిబ్రవరి 23) రాత్రి జరగగా.. మంగళవారం (ఫిబ్రవరి 24) ఉదయం వెలుగులోకి వచ్చింది.
కాగా భువన ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. అయితే భువన మృతి చెందిన విషయాన్ని హాస్టల్ యాజమాన్యం ఆలస్యంగా తమకు తెలిపిందని, పోలీసులకు కూడా వెంటనే సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉన్నత భవిష్యత్తు ఉన్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.







