TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోహన్ బాబుకు పద్మశ్రీ ఊరట

Published on: Mon Aug 3, 2015 2:57PM

 

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కు ఎట్టకేలకు పద్మశ్రీ వివాదంలో ఊరట లభించింది. ఒక చిత్రంలో మోహన్ బాబు పేరుతో పద్మశ్రీ కూడా కలిపి వేశారని.. పద్మశ్రీ అవార్డును మోహన్ బాబు దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంపై మోహన్ బాబు చిత్ర నిర్మాత తన ప్రమేయం లేకుండా టైటిల్స్ లో పద్మశ్రీని వేశారని.. పద్మశ్రీ అవార్డును దుర్వినియోగం చేయబోమంటూ గతంలో మోహన్‌బాబు సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. దీంతో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చి మోహన్‌బాబుకు పద్మశ్రీ యథాతథంగా కొనసాగుతుందని తీర్పునిచ్చింది. సుప్రీం ఇచ్చిన తీర్పుతో మోహన్ బాబుకు కొంత ఊరట లభించింది.