ఈ నెల 29న మోదీ విశాఖ పర్యటన ఖరారు

posted on: Nov 24, 2024 8:26PM

భారత ప్రధాని మోడీ  ఎపి పర్యటన ఖరారైంది. ఈ నెల 29న ప్రధాని విఖాఖ రానున్నారు. సిరిపురం జంక్షన్‌లో రోడ్‌షో, ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రధాని ఎన్టీపీసీ హైడ్రో పవర్ ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్‌ లకు శంకుస్థాపన చేయనున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కోసం జిల్లా యంత్రాంగం  అన్నిఏర్పాట్లు చేసింది.  అనకాపల్లి జిల్లాలోని పూడిమడకలో  అతిపెద్ద ఎన్టిపిసి  గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్  గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మద్దిలపాలెంలోని ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొని, అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన బీజేపీ నేతలు ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు రోడ్‌షో నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...