Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణలో పోలింగ్..మోడీ ట్వీట్..చంద్రబాబు స్పందన
posted on: Dec 7, 2018 9:44AM

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 119 స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. ‘ఇవాళ ఎన్నికల రోజు. తెలంగాణలో ఉన్న నా సోదర సోదరీమణులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని కోరుతున్నా. ప్రత్యేకించి నా యువ మిత్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని మరింత సుసంపన్నం చేయాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు.
టీడీపీ అధినేత,ఏపీ సీఎం చంద్రబాబు కూడా తెలంగాణలో ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఇవాళ తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వేసే ప్రతి ఓటు ఎంతో మార్పు తీసుకొస్తుందని గ్రహించాలని అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉదయం ట్వీట్ చేశారు.







