మహారాష్ట్రలో మోడీ టూర్.. ఎందుకు?
posted on: Oct 5, 2024 12:41PM

ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. మహారాష్ట్ర ఎన్నికలకు ముందు మోడీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక రోజు పర్యటనలో భాగంగా ఆయన పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడతను కూడా ప్రధాని విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద 9.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 20 వేల కోట్ల రూపాయల ప్రధానమంత్రి విడుదల చేయనున్నారు. అలాగే 5వ విడత ‘షేత్కారీ మహాసమ్మన్ నిధి యోజన’ కింద రెండు వేల కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నారు.






