Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మోదీ పర్యటన.. 300 మంది మిస్సింగ్
posted on: May 9, 2015 1:01PM

ప్రధాని నరేంద్రమోడీ ఛత్తీస్ గఢ్, దంతేవాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. అసలే మావోయిస్టులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా.... మావోయిస్టులు సుకుమా జిల్లాలోని 300 మందిని అపహరించినట్టు సమాచారం. సుకుమా జిల్లాలోని 4 గ్రామాలకు చెందిన వారు మోదీ సభకు వెళ్తుండగా వారిని అపహరించారు. సభకు ఇంకా 80 కి.మీ దూరంలో ఉండగా సోమ్ పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అయితే సుకుమా జిల్లా ఎస్పీ మాత్రం మోదీ పర్యటనకు 15 వేల మంది పోలీస్ భద్రత ఏర్పాటు చేశామని, ఆ వార్తల్లో నిజం లేదని ఖండించారు.






