Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పాక్‌ను ఏమార్చి దెబ్బకొట్టిన భారత్.. మోడీ మార్క్ వ్యూహం!
posted on: May 7, 2025 3:01PM

పహల్గాం ఉగ్ర దాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ కు దిగింది. . ఈ చర్యపై యావత్ భారతదేశం హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తోంది. దాయాదిని ఏమార్చి.. అత్యంత పకడ్బందీగా దాడుల ప్రణాళికలను భారత్ అమలుచేసింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాలు కీలకంగా నిలిచాయి. బాలాకోట్ దాడులకు ముందు కూడా ఇలాంటి వ్యూహాలనే ప్రధాని అమలుచేశారు. దాడులకు ముందు ప్రశాంతమైన ప్రవర్తనతో దాయాదిని మరోసారి ఏమార్చారు. ఈ దాడులతో పాక్ షాక్‌కు గురికాక తప్పలేదు.
బాలాకోట్ దాడి, ఆపరేషన్ సిందూర్‌ల మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. అయితే.. వీటిని దాయాది పాకిస్థాన్ పసిగట్టడంలో విఫలమైంది. మోడీ వ్యూహాలను అంచనా వేయడంలో వెనకబడింది. పాక్ దృష్టి మరల్చి దెబ్బకొట్టడంలో భారత ప్రధాని మోదీ మరోసారి పైచేయి సాధించారు. దీంతో దాయాది ఏమరపాటుగా ఉన్న వేళ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది.
పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్‌పై భారత్ దాడులు చేసింది. ఆ దాడికి 48 గంటల ముందు ప్రధాని మోడీ ఎప్పటిలానే ఎంతో ప్రశాంతంగా తన పనుల్లో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరి 25న ఆయన దిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని జాతికి అంకితం చేశారు. భారత సాయుధ దళాల పరాక్రమం గురించి మాట్లాడినప్పటికీ.. పాకిస్థాన్‌లోని ఖైబర్‌పంఖ్తుంఖ్వాలోని ఉగ్ర స్థావరాలపై జరగబోయే దాడుల గురించి ఎలాంటి సూచనలు చేయలేదు.
ఆ రోజు రాత్రి 9 గంటలకు భారత వాయుసేన దాడులకు సిద్ధమవుతుండగా.. ప్రధాని మోడీ దిల్లీలో ఓ మీడియా బృందం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. అభివృద్ధి, భారత ఆకాంక్షలు, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత సంకల్పం గురించి మాట్లాడారు. అయితే ఆ సమయంలో ప్రధాని ముఖంలో ఎలాంటి ఆందోళనా లేదు. ఎంతో ప్రశాంతంగా కనిపించారు. ఆ తర్వాత భారత బలగాలు తాము చేయాల్సిన పనిని విజయవంతంగా ముగించాయి.
బాలాకోట్ దాడికి ముందు ప్రధాని మోడీ ప్రవర్తన ఎలా ఉందో.. ఇప్పుడూ అలానే ఎంతో ప్రశాంతంగా కనిపించారు. అప్పుడు పాల్గొన్నట్లే.. దాడికి ఒక రోజు ముందు ఓ మీడియా సంస్థ నిర్వహించిన సమావేశంలో మోడీ పాల్గొన్నారు. మంగళవారం రాత్రి ఏబీపీ నెట్‌వర్క్ నిర్వహించిన ‘ఇండియా ఎట్ 2047 సదస్సులో మోడీ మాట్లాడారు. భారత జలాలను ఇక నుంచి దేశం దాటనివ్వబోమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల కోసమే వాటిని వినియోగిస్తామని తేల్చి చెప్పారు. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో.. ప్రధాని ముఖంలో ఎక్కడా ఆందోళన కనిపించలేదు.
మరోవైపు దేశవ్యాప్తంగా యుద్ధ సన్నద్ధతపై ప్రజలకు అవగాహన కల్పించే మాక్ డ్రిల్స్‌ను అంతకు ముందు ప్రకటించారు. ఇలాంటి కార్యక్రమాలతో.. దేశ ప్రజలను సైనిక చర్యకు, దాని పరిణామాలకు మోడీ సిద్ధం చేస్తున్నారనే సూచనలు మాత్రమే ప్రత్యర్థుల్లోకి వెళ్లాయి. అయితే.. ఇవన్నీ దాయాదిని ఏమార్చడానికి ఒక వ్యూహం మాత్రమే అని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిని పసిగట్టడంలో.. అప్పుడు బాలాకోట్ దాడుల సమయంలోనూ.. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ పాకిస్థాన్ పూర్తిగా విఫలమైంది. దీంతో దాయాది దృష్టి మరల్చి దాడి చేయడంలో మరోసారి భారత బలగాలు పైచేయి సాధించాయి.



.webp)


