సైనికులతో కలసి మోడీ దీపావళి
Published on: Wed Nov 11, 2015 6:35PM

భారత ప్రధాని నరేంద్రమోడీ బుధవారం నాడు అమృత్‌సర్ సమీపంలోని డోగ్రాయ్ యుద్ధ స్మారకం వద్ద సైనికులతో కలసి దీపావళిని జరుపుకున్నారు. దేశ గౌరవాన్ని పెంచుతూ దేశ భద్రతను పదిలంగా వుంచుతున్న సైనికులతో కలసి దీపావళి పండుగను జరుపుకోవడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని మోడీ పేర్కొన్నారు. భారత సైనికుల ధైర్యసాహసాలు, అంకితభావం వల్ల భారతదేశాన్ని ప్రపంచం ఎంతో గౌరవిస్తోందని ప్రశంసించారు. సైన్యం ధరించే యూనిఫాంను బట్టి కాకుండా వారి నడవడిక వల్లే ఇది సాధ్యమైందన్నారు. సైనిక దళాలకు సుదీర్ఘంగా నాయకత్వం వహిస్తున్నవారికి మోడీ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. డోగ్రాయ్ యుద్ధ స్మారకాన్ని సందర్శించి, అమర జవానులకునివాళులర్పించారు.


