Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మోడీ ఏపీ పర్యటన ఖరారైందా?
posted on: Nov 16, 2024 9:05AM

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెలలో ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. విశాఖ జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన కోసం ఆయన ఆంధ్రప్రదేశ్ రానున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ నెల 29న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానిక మోడీ రానున్నట్లు చంద్రబాబు శుక్రవారం (నవంబర్ 15) అసెంబ్లీ వేదికగా వెల్లడించారు.
అయితే పీఎంవో వర్గాల నుంచి మోడీ పర్యటనకు సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ ఇంకా వెలువడలేదు. ఎన్టీపీసీ గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా విశాఖ రైల్వేజోన్, పలు ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని అంటున్నారు. అధికారికంగా మోడీ పర్యటన ఖరారు కాకపోయినప్పటికీ అధికార యంత్రాంగం మోడీ పర్యటన ఏర్పాట్లు, బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లలో నిమగన్నమైపోయింది. మోడీ పర్యటన సందర్భంగా విశాఖ ఆంధ్రావర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వేదిక కానుంది. ఆ మైదానా్ని నిన్న జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు పరిశీలించి ఏర్పాట్లపై సమీక్ష జరిపారు.



.webp)


