Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమిత్ షా, మోడీలపై ఉండవల్లి ఫైర్
posted on: Jun 5, 2018 7:28PM

ఉండవల్లికి ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం అలవాటు.. అందుకే ఆయన మాటలకు అంత క్రేజ్.. రాష్ట్ర విభజన అనంతరం ఉండవల్లి, రాజకీయ పార్టీలకు దూరంగా ఉన్నారు గాని రాజకీయాలకు ఎప్పుడూ దగ్గరగానే ఉన్నారు.. వీలున్నప్పుడల్లా మైక్ పట్టి సలహాలూ ఇస్తారు.. విమర్శలూ చేస్తారు.. రీసెంట్ గా ఆయన మోడీ, అమిత్ షాల పై విరుచుకుపడ్డారు.. 'మోడీ మీద లవ్ వచ్చేసింది.. లవ్ వస్తే ఎవరేం చేయలేం.. మన పిల్లోడు తంతే, పన్ను ఊడినా వాడ్ని ఏమనం.. ఎందుకంటే కొడుకు కొడుకే.. అలానే మోడీ మనల్ని తంతుంటే.. ఆహా ఎంత బాగా తన్నడం నేర్చుకున్నాడు.. ఇలాంటి పీఎం మనకి కావాలనుకుంటాం'.. అంటూ ఉండవల్లి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
అంతేనా.. 'మోడీ నోరు తెరిస్తే బూతులు.. అన్నీ అబద్దాలే.. అయినా శవాల్ని రైల్లో ఉంచి రాష్ట్రమంతా తిప్పినోడు ఏదైనా చెప్పగలడు ఏదైనా చేయగలడు'.. అంటూ గోద్రా అల్లర్ల గురించి చెప్పుకొచ్చారు ఉండవల్లి.. 'అసలు గోద్రా అల్లర్లు.. అక్కడ చనిపోయిన వారి గురించి కాదు.. పోస్ట్ మార్టం చేసిన శవాల్ని రాష్ట్రమంతా తిప్పడం వల్ల జరిగాయని.. రూలింగ్లో ఉన్న మనమే ఇలా శాంతి భద్రతలకు భంగం కలిగించటం ఏంటని హరేన్ పాండ్యా అనే మంత్రి ప్రశ్నిస్తే ఆయన నాలుగు రోజులకి శవమై కనిపించారు' అన్నారు.
'ఈయన్ని చంపింది సోహ్రాబుద్దీన్.. ఆయన్నీ చంపేశారు.. తరువాత ప్రజాపతి అనే వ్యక్తిని పట్టుకొని విచారిస్తుంటే అతన్నీ చంపేశారు.. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారా అని తీగ లాగితే సాక్ష్యాత్తు అమిత్ షా బయటికొచ్చారు' అన్నారు.. 'ఈ కేసులో అమిత్ షా 11 నెలలు రిమాండ్లో ఉన్నారు.. మోడీ పీఎం కాగానే సిబిఐ వాళ్ళు కేసు విత్ డ్రా చేసుకున్నారని' గుర్తుచేశారు.. అసలు మోడీ అధికారం కోసం ఏదైనా చేస్తాడని ఆరోపించారు.. మొత్తానికి ఉండవల్లి.. మోడీ శవరాజకీయాలు, అమిత్ షా హత్యరాజకీయాల గురించి చెప్తూ బాగానే ఫైర్ అయ్యారు...


.jpg)



