మావోల మందుపాతరకు ముగ్గురు పోలీసులు హతం
Published on: Thu May 8, 2025 10:05AM
.webp)
ఓ వైపు కర్రిగుట్టల్లో పోలీసులు, భద్రతా దళాల కూంబింగ్ జరుగుతోంది. ఎన్ కౌంటర్లలో కర్రెగుట్టలు దద్దరిల్లిపోతున్నాయి. బుధవారం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 23 మంది మావోయిస్టులు మరణించారు. అదే సమయంలో మావోయిస్టులూ ప్రతిఘటిస్తున్నారు.
పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపార పేలి ముగ్గురు పోలీసులు హతమయ్యారు. ఈ సంఘటన ములుగు జిల్లా వాజేడులో జరిగింది. పోలీసులు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలలో ఉండగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. అనంతరం పోలీసులు లక్ష్యంగా కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మరణించారు.


