ఎమ్మెల్సీ వాణీదేవి కారుకు ప్రమాదం

posted on: Mar 25, 2021 10:52AM

అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కారు ప్రమాదానికి గురైంది. అసెంబ్లీ గేట్‌ నెంబర్‌ 8ని ఆమె కారు ఢీకొట్టింది. అయితే ఆ సమయంలో వాణీదేవి కారులో లేకపోవడంతో ముప్పు తప్పింది. ఎమ్మెల్సీ వాణీదేవిని మండలి దగ్గర దింపి వస్తుండగా ఆమె కారుకు ప్రమాదం జరిగింది. పార్కింగ్‌ చేస్తుండగా అదుపు తప్పిన కారు రైల్వే కౌంటర్‌ సమీపంలోని గేటుపైకి దూసుకెళ్లింది. దీంతో కారు టైరు పేలిపోయింది. ప్రమాద సమయంలో కారును ఎమ్మెల్సీ గన్‌మెన్‌ నడిపినట్టు తెలుస్తోంది. కారు టైరు పేలి పెద్ద శబ్ధం రావడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమై.. ఘటనా స్థలానికి చేరుకొన్నారు. యాక్సిడెంట్ లో ఎమ్మెల్సీ కారు బాగా డ్యామేజీ అయింది. ఆ సమయంలో వాణీదేవి కారులో ఉండుంటే ఆమెకు పెద్ద ప్రమాదమే జరిగుండేది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...