తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు...బిజెపి అభ్యర్థులు వీరే...
Published on: Fri Jan 10, 2025 4:17PM
తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బిజెపి అభ్యర్థులను ప్రకటించింది. రెండు ఉపాధ్యాయ ఒక పట్టభధ్ర ఎన్నికకు సంబంధించి అభ్యర్థులను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. నల్గొండ -వరంగల్ -ఖమ్మం ఉపాద్యాయ ఎంఎల్ సి స్థానానికి అభ్యర్థిగా పులి సర్వోత్తమ్ రెడ్డి , కరీంనగర్ -నిజామాబాద్ -ఆదిలాబాద్- మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా మల్కా కొమరయ్యను ఎంపిక చేశారు. కరీంనగర్ -నిజామాబాద్ -ఆదిలాబాద్- మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సి అంజిరెడ్డిని ఎంపిక చేశారు.


