Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మాజీ మంత్రి నారాయణ స్వామికి సిట్ నోటీసులు
posted on: Jul 19, 2025 10:15AM
.webp)
ఏపీ మద్యం కుంభకోణంలో సిట్ మరింత వేగం పెంచింది. ఇప్పటికే పలువురిని సిట్ విచారించి..కొందరిని అరెస్ట్ చేసింది. అయితే తాజాగా సిట్ అరెస్టు చేస్తుందని ముందస్తు బెయిల్ కోసం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హైకోర్టు, సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వలేమని రెండు కోర్టులూ కూడా స్పష్టం చేశాయి. మరో వైపు సిట్ కూడా మిథున్ రెడ్డి ని అరెస్టు చేసే దిశగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అయితే సిట్ విచారణ కు రావాలని ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ ఆధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో మద్యం కుంభకోణంలో కేసులో నిందితుడు మిథున్ రెడ్డి సిట్ విచారణకు శనివారం హాజరుకానున్నారు. ఉ మద్యం కుంభకోణం కేసులో A 4 గా మిథున్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం కూడా ఉంది. మరో వైపు గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పని చేసిన కలత్తూరు నారాయణ స్వామికి సిట్ నోటీసులు జారీ చేసింది. సోమవారం సిట్ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి నారాయణ స్వామి సైతం కనిపించడం లేదు. అరెస్టు భయంతో కనిపించకుండా పోయారని ప్రచారం జరుగుతోంది.



.webp)


