''మిస్ అమెరికా'' గా ఎంపికైన తెలుగమ్మాయి

Publish Date:Sep 16, 2013

Advertisement

 

 

 

అమెరికా అందాల పోటిల్లో తెలుగుద‌నం త‌ళుక్కు మంది.. భార‌త్ చెందిన నీనా దావులూరి అమెరికాలో జ‌రిగిన అందాల పోటిల్లో మిస్ అమెరికా కిరీటాన్ని సొంతం చేసుకుంది. మిస్ న్యూయార్క్‌గా పోటిలో నిలిచిన నీనా 15 మంది ఫైన‌లిస్ట్‌ల‌ను అధిగ‌మించి మిస్ అమెరికా కిరీటంతో పాటు 50 వేల డాల‌ర్ట ప్రైజ్ మ‌నీ కూడా సొంతం చేసుకుంది.


విజ‌య‌వాడ కు చెందిన నీనా త‌న అందంతోనే కాదు త‌న మాట‌ల‌తో కూడా అమెరిక‌న్స్ మ‌న‌సు గెలుచుకుంది. పుట్టుకతో వచ్చే శారీరక అందం, ఏ సర్జరీకి తలవంచని మాససిక ఆనందమే గొప్పదని చెప్పి అందరినీ ఆకట్టుకుంది. 24 నాలుగేళ్ల ఈ ముద్దుగుమ్మ అమెరికా అందాలపోటిల్లో గెలిచి మ‌రోసారి మ‌న దేశ‌గౌర‌వాన్ని తెలుగు వారి కీర్తిని పాశ్చాత్యుల‌కు ప‌రిచ‌యం చేసింది.