Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గండికోటలో మైనర్ విద్యార్థిని దారుణ హత్య
posted on: Jul 15, 2025 2:47PM
.webp)
వైయస్సార్ కడప జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో దారుణం జరిగింది.ఇక్కడ ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. హత్య గురైన బాలిక మృతదేహం ముళ్ళపొదల్లో నగ్నంగా పడి ఉండడం చూస్తే హంతకుడు హత్యాచారానికి పాల్పడ్డాడన్న అనుమానాలు వ్యక్తం అవు తున్నాయి.అందిన సమాచారం మేరకు బాలిక ప్రొద్దుటూరులోని గీతం జూనియర్ కాలేజీలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతోంది.
సోమవారం ఉదయం 8 గంటలకు కళాశాలకు వెళుతున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తి గ్రామానికి చెందిన లోకేష్, అదే గ్రామానికి చెందిన బాలికను తన ద్విచక్ర వాహనంపై ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో గండికోట కు తీసుకువెళ్లాడు. తరువాత 10:47 గంటల సమయంలో లోకేష్ ఒక్కడే తన ద్విచక్ర వాహనంపై గండికోట నుంచి వెనక్కు వచ్చేసినట్లు సిసి ఫుటేజీలో రికార్డు అయ్యింది.
కాగా ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో బాలిక కాలేజీకి రాలేదని కళాశాల యాజమాన్యం ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు . ఉదయం 8 గంటలకే తమ కుమార్తె కాలేజీకి వచ్చిందని చెప్పిన కుటుంబ సభ్యులు ఆ వెంటనే కాలేజీకి వచ్చి విచారించారు. లోకేష్ ఆ బాలికను బైక్ పై తీసుకు వెళ్లాడని తెలియగానే వారు గండికోటకే వెళ్లి ఉంటారని భావించిన కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి , గండికోటకు వెతికేందుకు వెళ్లారు. సాయంత్రం వరకు వైష్ణవికి సంభంధించిన ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు.సాయంత్రం గండికోట పై భాగంలో మైనర్ విద్యార్థిని కాలేజీ బ్యాగు , చున్ని కనిపించాయి. దీంతో ఆ చుట్టుపక్కల వెతికినా మైనర్ విద్యార్థిని ఆచూకీ లభించలేదు.
విషయం తెలుసుకున్న పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిసింది. అతని ఇచ్చిన సమాచారం మేరకు మైనర్ బాలిక మృతదేహం ఉన్న ప్రాంతాన్ని పోలీసులు, కుటుంబ సభ్యులు మంగళవారం (జులై 15) ఉదయం గుర్తించారు. మైనర్ విద్యార్థినిని హత్య చేసినట్లు నిర్ధారించుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



.webp)


