TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంత్రి పొంగులేటికి మల్లికార్జున ఖర్గే వార్నింగ్

Published on: Fri Jun 27, 2025 11:16AM

 

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ  జాతీయ అధ్యక్షుడు అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల పొంగులేటిపై కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయిన ఖర్గే.. గంటసేపు మాట్లాడారు. ‘బహిరంగంగా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని కోరారు. 

ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దు' అని ఖర్గే హెచ్చరించినట్టు సమాచారం. మంత్రి పొంగులేటి తీరు నచ్చక తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసి కొందరు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినట్లు టాక్. అలాగే గతంలో బాంబులు పేలతాయని.. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి పొంగులేటి. రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమన్వయంగా ఉండాలని పొంగులేటికి మల్లికార్జున్ ఖర్గే సూచించారు.