TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీ నేత అన్నామలైతో మంత్రి లోకేశ్‌ భేటీ

Published on: Mon Sep 8, 2025 5:16PM

 

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైను మంత్రి నారా లోకేష్ ఇవాళ భేటీ అయ్యారు.  కోయంబత్తూరులో వీరిద్దరి మధ్య ఈ మర్యాదపూర్వక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను లోకేష్ వివరించారు. డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలో ఉన్నందున ఏపీ వేగవంతంగా అభివృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు. 

కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, విద్యారంగంలో తాము చేపడుతున్న సంస్కరణలు దేశంలోనే రోల్ మోడల్ గా నిలుస్తున్నాయని అన్నామలైతో లోకేష్ చెప్పారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ను సందర్శించాల్సింగా అన్నామలైని లోకేష్ ఆహ్వానించారు. ముఖ్యంగా విద్యారంగంలో తాము అమలు చేస్తున్న సంస్కరణలు, కూటమి ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని లోకేశ్ తెలిపారు.