Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆటోలో గీసుకొండ పోలీస్ స్టేషన్ కు వచ్చిన మంత్రి కొండాసురేఖ
posted on: Oct 14, 2024 11:03AM
మంత్రి కొండాసురేఖ భర్త కొండామురళి, ఎమ్మెల్యే రేవూరి వర్గీయుల మధ్య గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. కొండా వర్గీయులను పోలీసులు అరెస్ట్ చేయడం మంత్రి కొండాసురేఖకు కోపం తెప్పించింది. వెంటనే ఆమె ఆటో కట్టుకుని గీసుకొండ పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీసులతో ఘర్షణ పడ్డారు. బతుకమ్మవేడుకల్లో ఎమ్మెల్యే రేవూరి ఫోటోలు లేకపోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది.
పరకాల నియోజకవర్గంలో ప్లెక్సీల విషయంలో ఇరు వర్గాలు కొట్టుకునే వరకు వెళ్లింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆందోళన కారులను అరెస్ట్ చేశారు. వీరిలో కొండా వర్గీయులు ఉన్నారు. తమ అనుచరులను ఎలా అరెస్ట్ చేస్తారు అని మంత్రి కొండాసురేఖ పోలీస్ కమిషనర్, సి ఐల ను పోలీస్ స్టేషన్ లోనే నిలదీశారు. పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ కుర్చీలో మంత్రి కొండా సురేఖ కూర్చొని పోలీసులను నిలదీశారు ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల సినీ హీరో నాగార్జున కుటుంబం మీద వివాదాస్పద వ్యాఖ్యలుచేసిన మంత్రి కొండాసురేఖ నాంపల్లికోర్టులో పరవు నష్టం దావా కేసులో ఇరుక్కున్నారు. తాజాగా వరంగల్ నర్సంపేట రోడ్డులో జరిగిన ఘర్షణతో మరోసారి వార్తల్లోకెక్కారు.






