TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ మంత్రికి తీవ్ర అస్వస్థత

Published on: Fri Apr 3, 2015 9:42AM

 

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో వున్న కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని కేర్ ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు పేస్ మేకర్ అమర్చి చికిత్స చేస్తున్నారు. కేర్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సోమరాజు, డాక్టర్ నరసింహన్ ఆధ్వర్యంలో చికిత్స జరుగుతోంది. గురువారం నాడు పోచారం శ్రీనివాసరెడ్డిని తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, పలువురు ప్రజా ప్రతినిధులు పరామర్శించారు. వారిలో జూపల్లి కృష్ణారావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, కల్వకుంట్ల కవిత భర్త అనిల్ కుమార్ తదితరులున్నారు.