త్వరలో 50వేల ఉద్యోగాలు.. నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..

posted on: Mar 25, 2021 12:12PM

తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి హరీశ్‌రావు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే 50వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రకటించారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. మంత్రి హరీశ్ ప్రకటనతో నిరుద్యోగులు ఫుల్ ఖుషీ.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు. ప్రభుత్వ తాజా ప్రకటనతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 30శాతం పీఆర్సీ పెంచి ఉద్యోగులను సంతోష పెట్టింది ప్రభుత్వం. లేటెస్ట్‌గా.. 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌తో ఇటు నిరుద్యోగులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...