Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మోగని మంత్రి గంటా
posted on: Sep 23, 2012 1:56PM
అనుకున్నట్లే అయింది. ఓడరేవు మంజూరులో విశాఖ జిల్లాకు అన్యాయం జరిగింది. నక్కపల్లిలో రెండో ఓడరేవు నిర్మిస్తారని విశాఖజిల్లావాసులు ఆశపడ్డారు. ఈ మేరకు కృషి చేస్తానని అనకాపల్లికి చెందిన మంత్రి గంటాశ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఏమి చూసుకుని ఈ హామీ ఇస్తున్నారని మంత్రిని తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా నాయకులు నిలదీశారు. అంతేకాకుండా వాస్తవం ఆయనకు అర్థం కావటం లేదని జిల్లా అభివృద్థి సమావేశాన్ని కూడా దేశం నేతలు బహిష్కరించారు. దీనితో పాటుగా తమ నిరసనను కూడా తెలియజేశారు. దీనికి తోడు వారు ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి మానుగుంట మహీధరరెడ్డి పట్టుదలగా రెండోఓడరేవు సాధిస్తారని కూడా అప్పట్లో తెలుగుదేశం నేతలు నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వారు హెచ్చరించినట్లే మంత్రి గంటా హామీ నెరవేరలేదు.
తెలుగుదేశం నేతలు చెప్పినట్లే మంత్రి మానుగుంటమహీధరరెడ్డి పట్టినపట్టుకు రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తలవొంచక తప్పలేదు. మహీధరరెడ్డి నియోజకవర్గంలోని రామాయపట్నంలో రెండో ఓడరేవు నిర్మించాలని సిఎం కిరణ్ షిప్పింగ్‌కార్పొరేషనుకు లేఖ రాశారు. దీంతో రాష్ట్రప్రభుత్వ పరంగా ఓ నిర్ణయానికి వచ్చారన్న సంకేతం షిప్పింగ్‌కార్పొరేషనుకు అందింది. కార్పొరేషను ఛైర్మన్ పి.మోహన్ మాట్లాడుతూ సిఎం ఖరారు పూర్తయినందున కేంద్ర కేబినెట్ ముందు ఈ విషయాన్ని ఉంచి అనుమతి పొందాక ఓడరేవు నిర్మిస్తామన్నారు. ఈ విషయం తెలిసిన విశాఖజిల్లా తెలుగుదేశం నేతలు మరోసారి తమ నిరసనను మంత్రి గంటాకు తెలియజేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ప్రకాశం జిల్లాలో నేతలు మాత్రం మానుగుంట కృషిని అభినందిస్తున్నారు. రెండో ఓడరేవు సాధించటం వల్ల వెనుకబడిన జిల్లాకు మరింత ఆర్థికప్రయోజనం ఓనగూరుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.



.jpeg)


