TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నిరుద్యోగ అర్చకులకు రూ.3 వేల భృతి : మంత్రి ఆనం

Published on: Sat Jul 12, 2025 4:48PM

 

ఏపీలో నిరుద్యోగ అర్చకులకు రాష్ట్ర  దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి  శుభవార్త చెప్పారు. 590 మంది వేద పండితులు నిరుద్యోగులుగా ఉన్నారని.. వారికి నెలకు రూ.3 వేల భృతి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.  దేవాదాయశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలోని పునర్నిర్మాణంలో ఉన్న ఆలయాలకు రూ. 147 కోట్లు విడుదల కాకుండా నిలిచిపోయాయన్నారు. వీటన్నింటిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. 

సంయుక్త సమావేశంలో టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో శ్యామలరావు, ఇతర అధికారులతో సమీక్షించి తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఆనం తెలిపారు. గతంలో సీఎం చంద్రబాబుతో నిర్వహించిన సమీక్షలో ఆలయాలకు సంబంధించిన పలు సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఆయా సమస్యలపై చర్చించి రావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

శ్రీవాణి ట్రస్టు నిధులపై నిర్ణయం తీసుకుంటామని బోర్డు చెప్పింది. విజయవాడ దుర్గ గుడికి మరో రోడ్డు వేసేందుకు టీటీడీ సహకారం కావాలి. తిరుమల దేవస్ధానం బోర్డులో అన్యమతస్థులు ఉన్న విషయం వాస్తవం. టీటీడీ బోర్డులో దాదాపు 1000 మంది అన్యమతస్థులు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో విచారణ కొనసాగుతోందన్నారు.