పోలీసులపై అఖిల ప్రియ ఆగ్రహం.. నాకు మీ సెక్యూరిటీ వద్దు

posted on: Jan 5, 2019 2:24PM

 

ఏపీ మంత్రి అఖిల ప్రియ సన్నిహితులు, అనుచరుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టడం ఆళ్లగడ్డలో సంచలనంగా మారింది. ఈ విషయం గురించి తెలుసుకున్న అఖిల ప్రియ ఓవైపు పోలీసుల తీరుపై సీరియస్ అవుతూనే.. మరోవైపు నిరసన తెలిపారు. తన రక్షణ కోసం పోలీసులు ఏర్పాటు చేసిన గన్ మెన్లను వెనక్కి పంపిచడంతో పాటు ఇకనుంచి తనకు పోలీస్ రక్షణ అవసరం లేదంటూ అఖిల ప్రియ నిరసనకు దిగారు.

బుధవారం అర్థరాత్రి పోలీసులు వివిధ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. అయితే ఈ తనిఖీలు మంత్రి అఖిల ప్రియకు సన్నిహితంగా ఉండే నాయకుల ఇళ్లలో కూడా జరిగాయి. దీంతో వారు పోలీసుల వ్యవహారంపై అఖిల ప్రియకు ఫిర్యాదు చేశారు. అఖిల ప్రియ స్థానిక పోలీసులకు ఈ వ్యవహారంపై ప్రశ్నించగా.. ఉన్నతాధికారుల ఆదేశాలదతోనే ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. దీంతో ఆగ్రహించిన అఖిల ప్రియ పోలీస్ సెక్యూరిటీని ఉపసహరించుకుని నిరసన తెలిపారు. అయితే పోలీసులు అన్ని పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తల ఇళ్లలో తనిఖీలు చేపట్టారని.. శాంతి భద్రతల విషయంలో జరిగిన ఈ తనిఖీలను అఖిల ప్రియ కావాలనే రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...