జగన్ మూర్ఖుడు
Published on: Mon Aug 31, 2015 12:17PM
.jpg)
ఎపి శాసనసభలో పుష్కరాల మరణాలపై గందరగోళం జరిగినప్పుడు అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని జగన్ పై విమర్శలు కురిపించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ని ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు 'మూర్ఖుడు' అంటూ విరుచుకుపడ్డారు. శాసనసభా సంప్రదాయాలు తెలియని మూర్ఖుడు ప్రతిపక్ష నేత అవడం మన దురదృష్టం అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పుష్కరాలలో ప్రభుత్వం ఏమిచేసిందో చెప్పడానికి తాము సిద్దంగా ఉన్నామని అచ్చెన్నాయుడు అన్నారు.


