Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గాలిపై అనర్హత వేటు.. శాసనసభ సభ్యత్వం రద్దు
posted on: May 9, 2025 5:04AM

మైనింగ్ మాఫియా డాన్, బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై అనర్హత వేటు పడింది. అక్రమ మైనింగ్ కేసులో హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనను దోషిగా నిర్దారించి ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన శాసనసభ సభ్యత్వం రద్దైంది. ఈ మేరకు ఈ మేరకు కర్ణాటక శాసనసభ కార్యదర్శి ఎం.కె. విశాలాక్షి గురువారం (మే8)న నోటిషికేషన్ విడుదల చేశారు. ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రధాన ప్రత్యేక న్యాయమూర్తి కర్ణాటక శాసనసభ సభ్యుడు గాలి జనార్దన్ రెడ్డిని దోషిగా నిర్ధారించి శిక్ష విధించిన కారణంగా ఆయన శాసనసభ సభ్యత్వానికి అనర్డుడిగా ప్రకటిస్తున్నట్లు ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
భారత రాజ్యాంగంలోని ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం గాలి జనార్దన రెడ్డిపై అనర్హత వేటు పడింది. గాలి జనార్దన్ రెడ్డికి విధించిన శిక్షపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించకపోతే.. ఆయన శిక్ష అనుభవించి విడుదలైన తరువాత కూడా మరో ఆరేళ్ల పాటు అనర్హత కొనసాగుతుంది. గాలి జనార్ధన్ రెడ్డి అనర్హత తీర్పు వెలువడిన ఈ నెల 6 నుంచి అమలులోకి వచ్చిందని విశాలాక్షి ఆ నోటిఫికేషన్ లో పేర్కొంది.
ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డిని హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ నెల 6న తీర్పు ఇచ్చిన సంగతి విదితమే. అక్రమ మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి రూ.884 కోట్ల నష్టం కలిగించారని పేర్కొంటూ గాలి జనార్ధన్ రెడ్డిపై 2009లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆ కేసులోనే జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల ఖైదు విధిస్తూ తీర్పు వెలువడింది.



.webp)


