Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఓడిపోయి.. తప్పతాగి...
posted on: Mar 20, 2021 1:10PM
ఎన్నికలు అన్నాక గెలుపు ఓటమిలు సహజం .. ఎన్నికలో ఓడిపోతే కొందరు బాధపడుతాడు. లేదంటే మనకు అదృష్టం బాగాలేదని అనుకుంటారు. మహా అయితే మన టైం బాలేదు మళ్ళీ పోటీచేద్దాం అనుకుంటారు. కానీ ఓటమి ని జీర్ణించుకొని ఒక వ్యక్తి ఏం చేశాడో తెలుసా. తనకు ఓట్లు వేయలేదని మందు తాగి ఓటర్లను నానా మాటలు అన్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.? ఏ పార్టీకి సంభందించిన వ్యక్తి అని తెలుసుకోవాలనుకుంటున్నారా.
ఏపీ మంత్రి మేకపాటి ముఖ్య అనుచరుడు ఆండ్ర సుబ్బారెడ్డి ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లో రెండవ వార్డు నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఈయన ఓటమి చవిచూసారు. వార్డు ఎన్నికల్లో ఓడిపోయాననే ఆక్రోశంతో పూటుగా మద్యం సేవించి గ్రామ సచివాలయానికి వెళ్లి నానా హంగామా చేశారు. తనకు ఓట్లు వేయనివారు నాశనమవుతారంటూ శాపనార్ధాలు పెడుతూ అక్కడి స్థానికులను భయాందోళనకి గురి చేశారు. పీకల్లోతు మద్యం సేవించి గందరగోళం సృష్టించిన ఆయన చేష్టలతో విసిగిపోయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకుని సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.






