మాకు నాలుగు రాష్ట్రాలు కావాలి

 

తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ రెడీ అవ్వటంతో ఇప్పుడు మ‌రిన్ని విభ‌జ‌న అంశాలు తెర మీద‌కు వ‌స్తున్నాయి. ముఖ్యంగా చాలా రోజులు త‌మ రాష్ట్రాన్ని నాలుగు ముక్కలుగా చీల్చాలంటూ కోరుతుంది యుపి నేత మాయ‌వ‌తి. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తామెప్పుడు సుముఖంగానే ఉన్నా మ‌న్న మాయ త‌మ రాష్ట్ర స‌మ‌స్యను కూడా త్వర‌గా ప‌రీక్షించాల‌ని కోరారు.

ఇప్పటికే గుర్ఖాలాండ్ ఉద్యమం కూడా ఊపంవుకోవ‌టంతో మ‌రిన్ని డిమాండ్‌లు వ‌చ్చే అవ‌కాశం ఉందంటున్నారు విశ్లేష‌కులు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరేక‌మ‌ని ప్రక‌టించిన జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమ‌ర్ అబ్దుల్లా తెలంగాణ ఏర్పాటు తో పాటు ఇత‌ర డిమాండ్లను కూడా ఖండించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu