నిర్మాతగా పవన్‌ వైఫ్ రేణు దేశాయ్

posted on: Jun 18, 2013 11:08AM

 

Pawan Kalyan wife Renu Desai turns producer, Pawan Kalyan Renu Desai

 

 

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ మరాఠీ లో చిత్రాన్ని తీసేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్ర కథాంశమే అంతటా చర్చనీయాంశమైంది. విడిపోవడానికి సిద్ధపడిన భార్యభర్తలు.. చివరికి ఎలా కలిసారన్నది ఈ చిత్ర కథాంశం. రేణుదేశాయ్ స్వస్థలం పూణె కావడంతో.. ఆమె మరాఠీ చిత్రాలను నిర్మించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. మరాఠీ చిత్రాలపై బాలీవుడ్ ప్రభావం కూడా పుష్కలంగా ఉంటుంది గనుక.. ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ చిత్రానికి "మంగళాష్‌టేక్" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఈ చిత్ర కథ కాస్త అటు ఇటుగా పవన్‌కళ్యాణ్రేణుదేశాయ్‌ల ప్రస్తుత స్థితిని ప్రతిబింబించేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా షూటింగ్ పుణెలో సాగుతోంది. స్వప్నిల్‌ జోషి, ముక్తా భార్వే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...