Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆలీతో పవన్ కళ్యాణ్ సెలబ్రేషన్స్
posted on: May 21, 2013 11:04AM

సీనియర్ హాస్యనటుడు అలీ గౌరవ డాక్టరేట్ దక్కిందన్న విషయం తెలియడంతో హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ ఆయనను అభినందించారు. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అత్తారింటికి దారేది?' సినిమా సెట్స్‌పై ప్రత్యేక కేక్‌ను తెప్పించి అలీ చేత కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆ చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, నటులు రవిప్రకాశ్, అమిత్ కూడా అలీకి అభినందనలు తెలిపారు. అలీ మాట్లాడుతూ "బాల నటునిగా నా సినీ జీవితాన్ని ప్రారంభించాను. ఇన్నేళ్లుగా చిత్రసీమలో కొనసాగుతూ ప్రేక్షకులకి వినోదాన్ని పంచుతున్నందుకూ, ఐదేళ్ల నుంచీ మా నాన్నగారి పేరు మీద ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకూ ఈ గౌరవ డాక్టరేట్ రావడం ఆనందంగా ఉంది'' అని చెప్పారు.



.jpg)


