Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బుడ్డోడ౦టే గుడ్డలూడతీసి కొడతా: జూనియర్ ఎన్టీఆర్
posted on: May 20, 2013 4:38PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' టీజర్ రిలీజైంది. జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఈ టీజర్ ను విడుదల చేశారు. ఈ టిజర్ లో ఎన్టీఆర్ సూపర్ గా వున్నాడనే అభిప్రాయం అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. టీజర్ లో 'బుడ్డోడు' అన్న దాని మీద ఓ పవర్ ఫుల్ డైలాగ్ పేల్చాడు ఎన్టీఆర్. ''ఎవడు పడితే వాడు బుడ్డోడు,బుడ్డోడు అని అంటే గుడ్డలూడతీసి కొడత..అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమాని అయ్యుండాలి'' ఈ డైలాగ్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లలో హాట్ గా మారింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో శరవేగంగా జరుగుతుంది. 'బాద్షా' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఎన్టీఆర్, 'గబ్బర్‌సింగ్' వంటి టాప్ గ్రాసర్ తీసిన హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో, దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.






