టీడీపీ నాయకుడు మసాల ఈరన్న కన్నుమూత

Publish Date:Apr 24, 2014

 

ఒకవైపు శోభా నాగిరెడ్డి మరణం రాష్ట్ర ప్రజలని విషాదంలో ముంచింది. మరోవైపు కర్నూలు జిల్లాకే చెందిన సీనియర్ రాజకీయవేత్త, తెలుగుదేశం నాయకుడు మసాల ఈరన్న మరణం ఆ విషాదాన్ని మరింత పెంచుతోంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే మసాల ఈరన్న గురువారం నాడు ఆలూరులో మరణించారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎమ్మెల్యే కాకముందు ఆయన జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా కూడా గెలుపొందారు. మంత్రాలయం మఠంలోకి దళితుల ప్రవేశానికి మసాల ఈరన్న ఎంతో కృషి చేశారు.

By
en-us Political News