TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చీపురు పట్టిన మేరీకోమ్

Published on: Fri Oct 24, 2014 6:21PM

 

భారత స్టార్ బాక్సర్, ఒలింపిక్ పతక విజేత మేరీకోమ్ స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో శుక్రవారం నాడు రోడ్లు ఊడ్చి శుభ్రం చేశారు. దీని మీద ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్విట్టర్లో స్పందిస్తూ మేరీకోమ్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం ప్రజల్లో ఉత్తేజాన్ని నింపుతుందని అన్నారు. ఆమెను ఈ సందర్భంగా మోడీ అభినందించారు. గాంధీ జయంతి రోజున పరిశుభ్ర భారతదేశం లక్ష్యంగా నరేంద్రమోడీ ఈ పథకాన్ని తాను స్వయంగా రోడ్డు ఊడ్చి ప్రారంభించారు. మోడీ అనిల్ అంబానీ తదితరులను ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరగా, అనిల్ అంబానీ కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా చీపురు పట్టారు. ఈ సందర్భంగా అనిల్ అంబానీ మేరీకోమ్‌ను స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పిలుపు ఇచ్చారు. ఆయన ఆహ్వానం మేరకు శుక్రవారం నాడు మేరీకోమ్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అనిల్ అంబానీ తనను ప్రతిపాదించడం ఆనందాన్ని కలిగిస్తోందని మేరీకోమ్ ఈ సందర్భంగా చెప్పారు.