TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మావోయిస్టులకు ఎదురుదెబ్బ..మరో అగ్రనేత మృతి

Published on: Thu Jun 5, 2025 4:40PM

 

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు టెంతు లక్ష్మీనరసింహాచలం అలియాస్ సుధాకర్, ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్ జిల్లాలోని జాతీయ పార్క్ వద్ద జరిగిన  ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. ఆయన తలపై రూ.50 లక్షల రివార్డు ఉంది. గత 40 ఏళ్లుగా మవోయిస్టు ఉద్యమంలో ఉన్న సింహాచలం 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంతో శాంతిచర్చల్లో కీలకంగా వ్యవరించారు. సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం.

ఆపరేషన్‌ కగార్‌, ఆపరేషన్‌ కర్రెగుట్టల పేరుతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో దాడులు చేస్తోంది. తమతో చర్చలు జరపాలనే మావోయిస్టు పార్టీ ఇదివరకే విజ్ఞప్తి చేసినా అ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.  ఈ మేరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్‌ల నిర్వహిస్తున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న హిడ్మాను  ఇటీవల  పోలీసులు అరెస్ట్‌ చేయగా, తాజాగా మావోయిస్టు అగ్రనేత సుధాకర్‌ మృతిచెందడం మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.