మావోయిస్టు గణపతి లొంగిపోవాలని సోదరుడి విజ్ఞప్తి
posted on: Feb 25, 2026 4:14PM

దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీని తన కనుసన్నల్లో నడిపి.. ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఆయన కోసం స్వగ్రామమైన బీర్పూర్ అంతా ఎదురు చూస్తోందన్నారు. గణపతి సోదరుడు రాంచంద్రరావు జగిత్యాలలో మాట్లాడుతూ మిగిలిన జీవితం తమతో గడపాలని గణపతిని కోరారు.
ఈ సందర్భంగా గణపతికి ఎటువంటి హాని తలపెట్టవద్దని ఈ సందర్భంగా పోలీసులను కోరారు. తన సోదరుడు గణపతి నేపాల్‌లో ఉన్నారని.. పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తల్లో చూశానని ఈ సందర్బంగా రాంచంద్రరావు పేర్కొన్నారు. పుట్టిన గడ్డ కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో కొట్లాడాలంటూ గణపతికి మీడియా ద్వారా సోదరుడు సూచించారు. 43 ఏళ్ల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు.
మావోయిస్టులంతా లొంగిపోయారని.. నువ్వు కూడా లొంగిపోవాలంటూ సోదరుడుకి రాంచంద్రారావు హితవు పలికారు. మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి తదితరులు లొంగిపోయారు. అదే సమయంలో మావోయిస్ట్ అగ్రనేత గణపతి నేపాల్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన వృద్ధాప్య సమస్యలతోపాటు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వెల్లడైంది.



.webp)



