Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హర్యానా సీఎంగా ఖట్టర్ ప్రమాణం
posted on: Oct 26, 2014 1:11PM

హర్యానా రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా భారతీయ జనతాపార్టీ నాయకుడు మనోహర్లాల్ ఖట్టర్ ఆదివారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. హర్యానాలోని పంచ్కులలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఖట్టర్ చేత హర్యానా గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అద్వానీతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు సీనియర్ నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 1966లో హర్యానా రాష్ట్రం ఏర్పాటైంది. ఇప్పుడు మనోహర్లాల్ ఖట్టర్ ఆ రాష్ట్ర తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. హర్యానా అసెంబ్లీకి మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్టోబర్ 15న ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 47 స్థానాలను కైవసం చేసుకుని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇప్పుడు హర్యానాలో కొత్త శకం ప్రారంభమైంది.



.jpg)


