Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మాంగనీస్ మాఫియాలో మంత్రి అనుచరులు
posted on: Mar 21, 2012 10:25AM
లిక్కర్ మాఫియా, కోల్ మాఫియా, మైనింగ్ మాఫియా, నార్కోటిక్ మాఫియాలతోపాటు ఇప్పుడు రాష్ట్రానికి మాంగనీస్ మాఫియా తోడైంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గత రెండేళ్ళుగా మాంగనీస్ అక్రమ వ్యాపారం జరుగుతోంది. దీనివెనుక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మంత్రివర్యులు అనుంగు అనుచరుల ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులకు చెందిన అనుచరులు తమ జిల్లాలోని అధికారులను లంచాలతో కట్టిపడేసి చత్తీస్ ఘట్, ఒడిశా రాష్ట్రాల నుంచి నిత్యం వందలాది టన్నుల మాంగనీసును మన రాష్ట్రంలోకి తరలిస్తున్నారు.
ఛత్తీస్ ఘట్, ఒడిశా రాష్ట్రలలో చౌకగా ఈ మాంగనీసును కొన్ని మన రాష్ట్రంలో ఎక్కువ రేటుకు విక్రయిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఒడిశా, ఛత్తీస్ ఘట్ రాష్ట్రాల్లో ఈ మాఫియా ముఠా మాంగనీస్ ను టన్నుకు రూ. 2 వేలకు కొనుగోలు చేస్తోంది. అక్కడినుంచి కాగితాలు, పత్రాలు లేకుండా చెక్ పోస్టుల్లో ఉద్యోగులను మేనేజ్ చేసి రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఇక్కడ ఇదే మాంగనీస్ ను టన్నుకు రూ. 14 వేల చొప్పున విక్రయిస్తూ కోట్లాదిరూపాయలు అర్జిస్తున్నారు. దీనికోసం మాంగనీస్ మాఫియా రామభద్రపురం, మక్కువ, బాడంగి, గరివిడి, సాలూరు, దర్తిరాజేరు తదితర ప్రాంతాల్లో అక్రమ మాంగనీస్ నిల్వ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ డీలర్ పాయింట్లు పొందిన వ్యక్తి లైసెన్స్ కలిగిన యజమాని వద్దనుంచి ఖనిజాలు, ఇసుక, కంకర తదితర ముడి సరుకులను కొనుగోలు చేసుకుని ఇతర ప్రాంతాలకు ఇక్కడనుంచి తరలించేందుకు ప్రభుత్వం అనుమతిస్తోంది. దీంతో మైనింగ్ మాఫియా ఈ పాయుంట్లను తమ అక్రమ వ్యాపారానికి వాడుకొని రాష్ట్రవ్యాప్తింగా మాంగనీస్ ను విక్రయిస్తోంది. మాంగనీస్ మాఫియా వ్యాపారులు మొదట మాంగనీస్ ను అక్రమంగా ఈ పాయింట్లకు తరలిస్తున్నారు. అక్కడ కాగితాలు పుట్టించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మాంగనీస్ ను తరలిస్తున్నారు. అండదండలుండటంతో వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.


.jpg)
.jpg)


