TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంచు మనోజ్ నిశ్చితార్ధ వేడుక నేడే

Published on: Wed Mar 4, 2015 8:41AM

 

ప్రముఖ నటుడు మంచు మనోజ్ వివాహ నిశ్చితార్ధ వేడుక ప్రణతి రెడ్డితో ఈ రోజు ఉదయం 10.30గంటలకి హైదరాబాద్ లో పార్క్ హయత్ హోటల్లో జరుగబోతోంది. ఈ వేడుకకు తెలుగు సినీపరిశ్రమ నుండి బాలకృష్ణ, ప్రముఖ దర్శకులు రాఘవేంద్ర రావు, దాసరి నారాయణ రావు తదితరులు, తమిళ చిత్ర పరిశ్రమ నుండి రజనీ కాంత్, బాలీవుడ్ నుండి అమితాబ్ బచ్చన్ తదితరులు హాజరు అయ్యే అవకాశముంది. ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు మరియు కేసీఆర్, నారా లోకేష్ ఇంకా అనేకమంది రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది.

 

ప్రణతి రెడ్డి బిట్స్ పిలానీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ చేసారు. ఆమె మంచు విష్ణు భార్య వేరోనికాకు క్లాస్ మేట్. ఆమె ద్వారానే మంచు మనోజ్ తో ప్రణతి రెడ్డికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. వారి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు కూడా అంగీకరించడంతో వారిప్పుడు వివాహ బంధం వైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం మంచు మనోజ్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో గొలుసు అనే ఒక సినిమాలో నటిస్తున్నారు. అది ఏప్రిల్ నెలాఖరుకి పూర్తి అయ్యే అవకాశం ఉంది. కనుక అది పూర్తి కాగానే మే నెలలో వారు వివాహం చేసుకొనే అవకాశం ఉంది.