Latest News

'మనం' రివ్యూస్ రిపోర్ట్: చరిత్ర సృష్టిస్తుందట!

posted on: May 23, 2014 8:16PM

 

 

 

అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలు నటించి చరిత్ర సృష్టించిన చిత్రం 'మనం'. నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం కూడా 'మనం'మే. గత కొంత కాలంగా ఈ సినిమా చూడడానికి తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచుస్తున్నారు. అయితే ఈ 'మనం' ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని సినీ విమర్శకులు పొగడ్తలతో ముంచెత్తడం విశేషం. అక్కినేనికి సిసలైన నివాళిగా ఈ చిత్రం నిలిచిపోతుందని వారు అంటున్నారు. అనూప్‌ సంగీతం ఈ చిత్రానికి ప్రాణ వాయువుగా మారింది. పాటలన్నీ వీనుల విందుగానే కాక కనువిందు చేశాయట. నాగ చైతన్య ఈ సినిమాలో మంచి నటనను కనబరిచారని అ౦టున్నారు. సమంత, చైతన్య కెమిస్ట్రీ మరోసారి బాగా కుదిరిందని అంటున్నారు. విక్రమ్‌ కుమార్‌... అక్కినేని హీరోలందరినీ ఒకే కథలోకి తెచ్చే ఛాలెంజ్‌ని యాక్సెప్ట్‌ చేసి దానిని సక్సెస్‌ఫుల్‌గా అచీవ్ చేసాడు. అక్కినేనికి సిసలైన నివాళిగా ఈ చిత్రం నిలిచిపోతుందని.. ఆయన నటించడంతో సినీ చరిత్ర పుటల్లో ఈ సినిమా చేరడం ఖాయమని అంటున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...