Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...'ఆపరేషన్ బిగ్ టైగర్' సఫలం... సంతోషంలో గ్రామ ప్రజలు
posted on: Oct 15, 2019 3:11PM

872 కిలో మీటర్లు విస్తరించి ఉన్న బందిపూర్ టైగర్ రిజర్వులో పెద్దపులి టెర్రర్ సృష్టించింది.ప్రజలను నిద్ర లేకుండా చేసి ఊరంత భయబ్రాంతులకు గురి చేసింది.ఎట్టకేలకు ఆపరేషన్ బిగ్ టైగర్ సక్సెస్ అయింది. ఇద్దరు గ్రామస్థులను పధ్ధెనిమిది పశువులను పొట్టబెట్టుకున్న రాక్షస పులిని ఫారెస్ట్ అధికారులు ఎట్టకేలకు బంధించారు. కొద్ది రోజులుగా తప్పించుకు తిరుగుతున్న పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది.
కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో హడలెత్తించిన పెద్దపులి ఎట్టకేలకు చిక్కింది. ఇద్దరు గ్రామస్థులతో పాటు పధ్ధెనిమిది పశువుల్ని పొట్టనబెటుకున్న ఈ పెద్దపులి కోసం ఫారెస్టు అధికారులు అతిపెద్ద ఆపరేషన్ చేపట్టారు. స్థానిక గిరిజనుల సహకారంతో ఈ పులిని ఎట్టకేలకూ బందించారు. అధికారులు పులిని పట్టుకోడానికి ఏకంగా ఆరు ఏనుగుల్ని ఓ వేటకుక్కను ఉపయోగించారు. మనుషులు పశువుల రక్తాన్ని రుచిమరిగిన ఈ రాక్షస పెద్దపులిని బందించటానికి గత ఐదు రోజులుగా చేపట్టిన గాలింపు చర్యలు ఎట్టకేలకు ఫలించాయి. ఓ పొదలో నక్కిన పులిని వేటకుక్కతో పాటు రెండు ఏనుగులు గుర్తించాయి.
మనిషి రక్తం రుచిమరిగిన పులిని చంపేయాలని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇక ఫారెస్టు అధికారులు వారికి నచ్చజెప్పారు. మత్తుమందు ప్రయోగించి పెద్దపులిని బందించారు. మత్తుమందుకి కూడా తొలుత పెద్దపులి లొంగలేదు. ఇంకో పొదలోకి వెళ్లింది. అయితే పులినక్కిన పొదలను స్థానిక స్థులిజ గిరిజనులు గుర్తించి వలలో బంధించారు. ఆ తరువాత పెద్ద పులిని మైసూర్ జూ కు తరలించారు. చివరకు దాన్ని బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పెద్దపులి జాడను గుర్తించడానికి అటవీ శాఖాధికారులు డ్రోన్ లు కూడా ఉపయోగించారు. డ్రోన్ కెమెరాలు పులి కదలికల్ని పసిగట్టాయి. వందలాది మంది సిబ్బంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. చివరకు ఆపరేషన్ సక్సెస్ కావడంతో స్థానికులు, గిరిజనులు ఎంతో సంతోషంగా ఉన్నారు.






